యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : ఎస్పీ

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

చివ్వెంల(సూర్యాపేట) : యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. శుక్రవారం మండలంలోని దురాజ్‌పల్లి శివారులోని ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో డ్రగ్స్‌పై విద్యార్థులకు నిర్వహించిన అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్‌ రహిత సమాజ కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అధికారులు, పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐలు వి.మహేశ్వర్‌, కనపక రత్నం, భరోసా ఎస్‌ఐ మౌనిక. షీటీం ఎస్‌ఐ నీలిమా, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

గరిడేపల్లి : మండలంలోని పొనుగోడు ఎంబీఆర్‌ ఫంక్షన్‌హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా మహాసభల్లో శుక్రవారం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ములకలపల్లి రాములు, ఉపాధ్యక్షులుగా పులుసు సత్యం, కొదమగుండ్ల నగేష్‌, జంపాల స్వరాజ్యం, నారసాని వెంకటేశ్వర్లు, సిరికొండ శ్రీను, సోమపంగా జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మట్టిపెల్లి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శిగా పోసనబోయిన హుస్సేన్‌, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మిట్టపల్లి లక్ష్మీ, కడెం కుమార్‌ను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభల చివరి రోజున పలు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి విద్యార్థుల ఎంపిక

భానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు బెస్ట్‌ అవెలబుల్‌ పథకం కింద వివిధ పాఠశాలల్లో విద్యనందించేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. 1వ తరగతిలో 89 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 82 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి కె.దయానందరాణి, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిస్యూట్‌ సొసైటీ కోఆర్డినేటర్‌ పద్మ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement