20న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

20న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

సూర్యాపేటటౌన్‌ : ఈ నెల 20న నిర్వహించే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కంపౌండబుల్‌ కేసులు, సివిల్‌ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన, డ్రంకెన్‌ డ్రైవ్‌, మోటారు ట్రాన్స్‌ఫోర్ట్‌ రోడ్డు నిబంధనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్‌ రికవరీ, చెక్‌ బౌన్స్‌ కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

టీపీటీఎఫ్‌ జిల్లా

అధ్యక్షుడిగా శ్రీనివాస్‌

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేసన్‌ జిల్లా అధ్యక్షుడిగా బండారి శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం నాయకులు రామనర్సయ్య, పుప్పాల వీరన్న, సీహెచ్‌.భిక్షం, పుప్పాల రవికుమార్‌, బడుగుల సైదులు, హనుమంతరావు, శిరగాని యాకయ్య, సుధాకర్‌రెడ్డి, నల్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్‌కుమార్‌, అర్చకులు రామాచార్యులు, పద్మనాభచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తుంగతుర్తిలో

డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

తుంగతుర్తి: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా మండల కేంద్రంలో ఆదివారం నార్కోటిక్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు నార్కోటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని షాపులు, పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. తని ఖీలు నిరంతరం కొనసాగుతాయని, గ్రామాల్లో మత్తు పదార్థాల రవాణా, వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఆర్టీసీ ఆర్‌ఎం బదిలీ

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్‌ మేనేజర్‌ జానిరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్‌ మేనేజర్‌గా ప్రస్తుతం నిజామాబాద్‌ ఆర్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యా రు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్‌ మేనేజర్‌గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా బదిలీ అయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement