సూర్యక్షేత్రంలో సౌరహోమం | - | Sakshi
Sakshi News home page

సూర్యక్షేత్రంలో సౌరహోమం

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్‌, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌స్వామి, గణపురం నరేష్‌, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement