మఠంపల్లి కవికి ప్రశంసా పత్రం | - | Sakshi
Sakshi News home page

మఠంపల్లి కవికి ప్రశంసా పత్రం

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

మఠంపల్లి : మఠంపల్లికి చెందిన కవి, గాయకుడు కర్ల శ్రీనివాస్‌ రాసిన కవితకు రాష్ట్రస్థాయిలో ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శనివారం రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనంలో కర్ల శ్రీనివాస్‌ పాల్గొని శ్రీపల్లె జనం గుండె తడి తెలంగాణశ్రీ కవితను రాసి వినిపించారు. ఆయన రాసిన కవితను ప్రసంసిస్తూ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యుడు దరువు అంజన్న, దరువు ఎల్లన్న ప్రశంసా పత్రం అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement