గరిడేపల్లి : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.భగవాన్ తెలిపారు. శనివారం గడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాలిసెట్ 2026, ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. గడ్డిపల్లిలోని ఘంటాగోపాల్‌రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్, కేవీకేలో ఈ కోర్సు అందుబాటులో ఉందన్నారు. అర్హత గల విద్యార్థులు వినియోగించుకోవాలని మరిన్ని వివరాలకు సెల్ : 9603268682 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కుంట ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా ఫెన్సింగ్
● ఆక్రమణను తొలగించిన
మత్స్యకారులు, గ్రామస్తులు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ఉన్న పోల్కమ్మ కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంత మంది ఫెన్సింగ్ వేయడం వివాదాస్పదమైంది. కుంటలోకి వెళ్లకుండా కొందరు అడ్డంగా ఫెన్సింగ్ వేయడంతో స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు కుంట వద్దకు వెళ్లి అక్రమ ఫెన్సింగ్‌ను నేలమట్టం చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు జంగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నార్ల రమేష్, గంగరబోయిన శీను, జటంగి రామనర్సు, వీరబోయిన గంగయ్య, జంగా లక్ష్మణ్, పిడుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో
సేవలందించాలి
నల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్‌షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు.
20న జాతీయ
లోక్ అదాలత్
భువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి లత కోరారు. శనివారం ఆమె జిల్లాలోని జూనియర్ సివిల్ జడ్జీలు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఏపీపీఓలు, ఎకై ్సజ్ పోలీస్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజీ పడదగిన కేసులను త్వరగా గుర్తించి కక్షిదారులకు వెంటనే నోటీసులు అందజేయాలని ఆదేశించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా వ్యాప్తంగా విస్తృ ప్రచారం చేయాలనానరు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.మాధవి లత భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. బాలురకు వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు.


