సూర్యాపేట అర్బన్ : ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యధితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి, పారిశుధ్యం, ఓటరు నమోదు తదితర అంశాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, డయల్ 100, లేదా 112 నంబర్లకు కాల్ చేస్తే పోలీసులే వారి వద్దకు వచ్చి అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏసీపీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్‌రావు, వార్డ్ కౌన్సిలర్ షేక్ జహీర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్‌రెడ్డి, డాక్టర్ అమూల్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన–ప్రగలతి ప్రణాళిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం మండలంలోని గుంజలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచనారాణి, తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్‌కుమార్, సర్పంచ్ బొలికొండ సైదులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


