పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

చివ్వెంల(సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్‌ పి.శివరాంప్రసాద్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవునికి ప్రకృతికి అవినావభావ సంబంధం ఉందన్నారు. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషిచేయాలన్నారు. ప్రకృతిని ప్రేమించి, భవిష్యత్‌ తరాలకు ఆరోగ్య వంతంమైన వాతావారణం అందించాలని సూచించారు. ప్రస్తుతం అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంచాల మమత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్‌, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, కె.ప్రియదర్శిని, న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాంప్రసాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement