మార్కెట్‌ విలువ పెంపును ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ విలువ పెంపును ఉపసంహరించుకోవాలి

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ విలువను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అసోసియేషన్‌ అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వ్యాల్యూ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పెంచితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలు కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌ విలువ పెరగడం వల్ల బిల్డింగ్‌ పర్మిషన్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ మరింత భారంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు దేవత్‌ కిషన్‌నాయక్‌, రాష్ట్ర కోశాధికారి సైదులు, రాష్ట్ర ఆర్గనైజేషన్‌ సెక్రటరి బొమ్మగాని శ్రీని వాస్‌గౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్‌కుమార్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి కంభంపాటి అంజయ్యగౌడ్‌, సభ్యులు వెన్న శ్రీనివాస్‌రెడ్డి, మాదిరెడ్డి గోపాల్‌రెడ్డి, మల్లయ్యగౌడ్‌, మారయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement