సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

పెన్‌పహాడ్‌ : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ, చికున్‌న్‌గున్యా, వైరల్‌ ఫివర్‌, అతిసారం వంటి వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ప్రసిద్ధ్‌ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. మండలంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. చీదెళ్ల గ్రామంలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం శ్రీడ్రై డ్ఙే ను పాటించాలని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ మోతీలాల్‌, మండల వైద్యాధికారి రాజేష్‌, ఆరోగ్య విస్తరణ అధికారి తాడూరి వెంకన్న, ఎంఎల్‌హెచ్‌పీ ప్రియాంక, ప్రేమ్‌ కుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ మాధవి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

జిల్లా మొదటి అదనపు జడ్జి

శివరాంప్రసాద్‌

సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ప్రసిద్ధ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement