నూతన గ్రామ పంచాయతీ ఎదుట సర్పంచ్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

నూతన గ్రామ పంచాయతీ ఎదుట సర్పంచ్‌ నిరసన

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచ్‌ పొల్నేడి నర్సమ్మ గురువారం నూతన పంచాయతీ భవనం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. అన్ని అనుమతులు ఇచ్చి, బిల్లులు మంజూరు చేసిన అధికారులే.. భవనాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతో భవన ప్రారంభాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను అధికారులు అవమానపరచడం తగదన్నారు. నూతన భవనాన్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె వెంట వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement