హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్టణంలో రూ 3.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ కొత్త బస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం గురువారం ఆయన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో మంత్రితో శంకుస్ధాపన చేయిస్తామన్నారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్ పట్టణానికి వచ్చిన ఎండీకి ముందుగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్‌రెడ్డి, ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ తుసూర్‌షా ఖాన్, ఆర్‌ఎం కే.జాన్‌రెడ్డి, డీఎం డి.శ్రీనివాసరావు, ఏఎస్‌ఎం పి.నాగశ్రీ, సూపరింటెండెంట్ సీహెచ్ నాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సులువ చంద్రశేఖర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి


