తెలంగాణ ఏర్పడక ముందు సూర్యాపేట,
తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేసేవారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, పెసర, కంది వంటి పంటల సాగు అధికంగా ఉండేది. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో వరి సాగు అధికంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రెండు పంటలను విడుదల చేయడంతో వరిసాగు అధికమైంది. అధిక శాతం రైతులు వరి సాగువైపు మళ్లారు. తెలంగాణ ఏర్పడక ముందు 2.32 లక్షల ఎకరాల్లో ఉన్న వరి.. 2026 నాటికి 4.80 లక్షల ఎకరాలకు చేరింది. ప్రతి సీజన్‌లో జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండి.. రాష్ట్రంలోనే వరి దిగుబడిలో సూర్యాపేట ముందంజలో ఉంది.


