పెరిగిన సాగు విస్తీర్ణం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన సాగు విస్తీర్ణం

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

పెరిగిన సాగు విస్తీర్ణం

వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న సూర్యాపేటలో సాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం లభించింది. జిల్లాలో నాగార్జునసాగర్‌ కాలువల కింద 2,29,961 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్‌–2 2,13,175 ఎకరాలు, నాగార్జునసాగర్‌ లిఫ్టుల కింద 38,422 ఎకరాలు, మూసీ ప్రాజెక్టు కింద 15,230 ఎకరాలతో పాటు చెరువులు, ఇతర లిప్టులు, బోరుబావుల కింద కలిపి దాదాపు 6,20,886 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3,98,218 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఎస్సారెస్పీ స్టేజ్‌ –2 కింద రెండు పంటలకు సాగు నీరు అందించడంతో 2026 నాటికి 6.20 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే దాదాపు 2,21,500లకు పైగా సాగు భూమి పెరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement