పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి : ఉత్తమ్‌ | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి : ఉత్తమ్‌

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌ హౌసింగ్‌ కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్లను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహతో కలిసి మంత్రి పరిశీలించారు. మిగిలిన పనుల గురించి మంత్రి వాకబు చేస్తూ ఇలా ఆలస్యంగా చేస్తే ఎలా అంటూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు రూ.50 లక్షలతో ఏర్పాటు చేసి అనుసంధానించిన 372 సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, మిషన్‌ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పెరిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్లు దొంతగాని శ్రీనివాస్‌, కొణతం చివెంకటరెడ్డి, వైస్‌ చైర్మన్లు తన్నీరు మల్లిఖార్జున్‌, నూకల సందీప్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ డి.రాధిక, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కోతి సంపత్‌రెడ్డి, గెల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

మఠంపల్లి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో రూ.80లక్షలతో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్‌ భవనాన్ని సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈసభలో వైస్‌ చైర్మన్‌ బాబునాయక్‌, పెరిక కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మంజీనాయక్‌, సీనియర్‌ నాయకులు సాముల శివారెడ్డి, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఆదూరి స్రవంతి కిషోర్‌రెడ్డి, సర్పంచ్‌ వీరలక్ష్మిపాపయ్య, ఉపసర్పంచ్‌ కొత్తపల్లిశౌరీ, అరుణాసైదులు, బాబుతోపాటు డివిజన్‌, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement