తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద పాఠశాలల అభివృద్ధి డిజిటల్ తరగతి గదులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, గురుకుల విద్యాసంస్థల విస్తరణ, గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికితోడు చిలుకూరు, తిరుమలగిరి మండలాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరై పనులు జరుగుతున్నాయి. అలాగే కోదాడకు జవహర్‌లాల్ నవోదయ విద్యాలయం మంజూరైంది.


