వేడుకల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

వేడుకల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట అవతరణ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. రాష్ట్ర అవతరన వేడకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉదయం 8 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరుల కుటంబ సభ్యులకు సత్కారం, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ, ప్రతిభా వంతులైన విద్యార్ధులకు సన్మానించనున్నట్టు పేర్కొన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. డివిజన్‌ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్‌ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఈఓ అశోక్‌, డీసీఓ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement