సూర్యాపేటటౌన్ : ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెనన్స్ డేలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో జూన్ ఒకటి నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీలు లేదా ఆ పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. అధిక శబ్ధం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని పేర్కొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ నరసింహ


