నాగారం : వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగారం మండలం ఫణిగిరిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంక్‌లు, సోలార్ పవర్ ప్లాంట్‌లు, ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఎస్‌ఓ మోహన్‌బాబు, తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, ఏపీఎం వెంకట్‌రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చామంతినరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


