సూర్యాపేటటౌన్ : పొగాకు వ్యసనాన్ని అందరం కలిసి అడ్డుకుందామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని అంబేద్కర్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రంగు రంగుల ప్యాకేజీలు, సువాసనలతో కూడిన ఫ్లేవర్డ్ సిగరెట్లు, ఈ–సిగరెట్ల వంటి వాటికి యువత, పిల్లలు ఆకర్షితులై వాటికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులను నమలడం, ధూమపానం వల్ల నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాసివ్ స్మోకింగ్ వల్ల గర్భిణులు, చిన్న పిల్లలు తీవ్ర ఆరోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. వీటి నుంచి బయట పడే వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘టొబాకో సెసేషన్ సెంటర్స్’ ద్వారా కౌన్సెలింగ్, మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జి.చంద్రశేఖర్, టీబీ యూనిట్ ఆఫీసర్ పి. వెంకటపాపిరెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి అమూల్య, డిప్యూటీ డెమో వి.సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ వెంకటరమణ


