అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆలయ క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్
జిల్లా జట్టు ఎంపిక
కోదాడరూరల్ : ఈ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్లను ఆదివారం కోదాడలోని ఈఆర్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్–19 బాల, బాలికలు, సీని యర్స్ సీ్త్ర పురుషులకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. అండర్–19 విభాగంలో జె.గౌతమ్ (హుజూర్‌నగర్), ఏ.సంతోష్ (కోదాడ), ఎండీ. మహ్మద్ క్వాహీ (కోదాడ), ఎండీ.మహ్మద్ హాది (కోదాడ), సీనియర్స్ విభాగంలో జె.సంతోష్ (హుజూర్‌నగర్), కె.ఉత్తేజ్ (సూర్యాపేట), కె.అవినాష్ (హుజూర్‌నగర్), రవీందర్ (కోదాడ), కె.నైనిక(సూర్యాపేట) ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరి తోట రంగారావు, కోచ్‌లు ఖాజా జలీల్, ఖాజా ఫజల్, నిస్సార్ పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణ, మదుఫర్కపూజ, మాంగల్యధారణ చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, నరేందర్ పాల్గొన్నారు.


