సర్కారు బడిలో స్పెషల్‌ కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడిలో స్పెషల్‌ కోచింగ్‌

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

ఉన్నత చదువుకు ఎంతో ఉపయోగం ఇంగ్లిష్‌లో మెరుగుపడ్డాను.. మూడేళ్లుగా కోచింగ్‌ ఇస్తున్నా.. దాతల సహకారం మరువలేనిది

చీమ – మిడత

వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఐఐటీ,

స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ

నార్కట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో మూడేళ్లుగా

కోచింగ్‌ ఇస్తున్న ఉపాధ్యాయులు

నార్కట్‌పల్లి : ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా నార్కట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. గత మూడేళ్లుగా వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు ఈ కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. వేసవి సెలవులకు ముందే ప్రధానోపాధ్యాయుడు రాములు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కోచింగ్‌ ఇప్పించాలని సూచించగా.. డబ్బుల్లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆయనే స్వయంగా పాఠశాలలో ఐఐటీ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు.

50 మంది విద్యార్థులకు కోచింగ్‌..

6 నంచి 10వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈ కోచింగ్‌కు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్వాన్‌ (స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్కట్‌పల్లి) సంయుక్త సహకారంతో ఇద్దరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఐఐటీ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పిస్తున్నారు.

ఐఐటీ కోచింగ్‌ తీసుకోవడం వలన నా పై చదువుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు కోచింగ్‌కు వస్తున్నాను. మ్యాథ్స్‌ మంచిగా అర్ధమయమ్యలా కోచింగ్‌ ఇస్తున్నారు.

– భాషపాక లోకేష్‌, 10వ తరగతి

గతంలో ఇంగ్లిష్‌లో వెనుకబడి ఉన్నాను. నెల రోజుల నుంచి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ తీసుకోవటం వలన ఇంగ్లిష్‌ రాయటం, చదవడం వస్తుంది. కోచింగ్‌ ఎంతో ఉపయోగంగా ఉంది.

– గడ్డం శ్రీనిత్య, 8వ తరగతి

మూడేళ్ల కితం ప్రధానోపాద్యాయుడు రాములు వచ్చి అడగడంతో ప్రతి వేసవిలో గత మూడేళ్లుగా నార్కట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఐఐటీ కోచింగ్‌ ఇస్తున్నాను. విద్యార్థులకు సులభంగా అర్థమమ్యేలా కోచింగ్‌ ఇస్తున్నాను.

– రాపోలు మాధవ, ఉపాధ్యాయుడు

దాతల సహకారంతో పాఠశాలలో చదువుకునే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ ఇస్తున్నాం. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నాం.

– రాములు, ప్రధానోపాధ్యాయుడు,

నార్కట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌

బామ్మ చెప్పిన కథ

వేసవి కాలంలో ఒక చీమ వానాకాలం కోసం ఎంతో కష్టపడి గింజలు మోసుకుంటూ ఆహారాన్ని కూడబెట్టుకుంటోంది. పక్కనే చెట్టు మీద ఉన్న ఒక మిడత చీమను చూసి, ‘అంత కష్టం ఎందుకు? నాలాగా హాయిగా పాడుకుంటూ ఆనందించొచ్చు కదా’ అని ఎగతాళి చేసింది. చీమ దాని మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. కొన్నాళ్లకు వానాకాలం రానే వచ్చింది. బయట అంతా వర్షం, ఎక్కడా ఆహారం దొరకలేదు. మిడతకు ఆకలితో ప్రాణం పోయేలా ఉండి, సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్లింది. అప్పుడు చీమ ‘కష్టపడాల్సిన సమయంలో పాడుకుంటూ కాలక్షేపం చేశావు, ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నావు. నీ బద్ధకమే నీకు శత్రువు’ అని చెప్పింది.

నీతి: సమయాన్ని వృథా చేయకూడదు. కష్టకాలం రాకముందే మన భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.

మంగినెపల్లి రోహిత్‌ చంద్ర, నకిరేకల్‌

మేము బొమ్మలు గీశామోచ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement