నల్లగొండ డీఈఓ బదిలీ | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ డీఈఓ బదిలీ

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యాధికారి(డీఈఓ) బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్‌రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు.

నేరాల నియంత్రణకు

నిరంతర తనిఖీలు

నల్లగొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్ల డించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్‌ రైడింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్‌ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement