రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే స్కోరెంతంటే? | Ruturaj Gaikwad Bats All 20 Overs,Gujarat Titans need 159 to win | Sakshi
Sakshi News home page

IPL 2026: రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే స్కోరెంతంటే?

Apr 26 2026 5:27 PM | Updated on Apr 26 2026 5:34 PM

Ruturaj Gaikwad Bats All 20 Overs,Gujarat Titans need 159 to win

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా గుజ‌రాత్‌ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికి రుతురాజ్ మాత్రం ఆచితూచి త‌మ జ‌ట్టుకు గౌర‌వ‌ ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించాడు.

60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్‌(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

గుజరాత్‌ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్‌ ఖాన్‌, సుత్తార్‌, సిరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్‌.. గుజరాత్‌పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement