జైలుకు రియాన్ ప‌రాగ్‌? | Riyan Parag Faces Controversy After Alleged Vaping Incident In Dressing Room During IPL 2026 Match, RR Captain To Be Jailed Mid IPL? | Sakshi
Sakshi News home page

IPL 2026: జైలుకు రియాన్ ప‌రాగ్‌?

Apr 29 2026 7:44 AM | Updated on Apr 29 2026 10:43 AM

Riyan Parag Vaping Video- RR Captain To Be Jailed Mid IPL?

రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం ఇది పెను సంచలనంగా మారింది. 

సాధరణంగా డ్రెస్సింగ్ రూమ్, స్టేడియం ఆవరణలో ధూమపానం చేయడం నిషిద్ధం. అంతేకాకుండా 2019 నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం, వాడకంపైనా నిషేదం ఉంది. 'ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం' ప్రకారం.. మొదటిసారి తప్పు చేస్తే ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష వరకు జరిమానా విధించే అవకాశముంది.

కొన్ని సందర్భాల్లో కేవలం జైలు శిక్ష మాత్ర‌మే విధించవచ్చు. కాగా ఇప్పుడు అతడు ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో నిబంధనలను ఉల్లఘించినందుకు బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసు​కోనుంది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు బీసీసీఐ అతడిపై మ్యాచ్‌ల నిషేధంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పరాగ్ ఇ-సిగరెట్ వాడకంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉండి, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన చూపడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజస్తాన్ ఘన విజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్‌కు రాజస్తాన్ ఓటమి రుచిని చూపించింది.  పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో  రాజ‌స్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. 223 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్తాన్ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.2 ఓవ‌ర్ల‌లో ఊదిపడేసింది.

రాజ‌స్తాన్ విజ‌యంలో (51), డోనోవన్ ఫెరీరా (52*) కీల‌క పాత్ర పోషించారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59), మార్కస్ స్టోయినిస్ (62*) రాణించారు.
చదవండి: ఫెరియెరా ఊచకోత.. పంజాబ్‌కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్‌

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement