భార‌త్‌కు తప్పని చైనా గండం! | PV Sindhu Loses India Womens Team Crashes Out Of Uber Cup 2026, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

Uber Cup: సింధు ఓటమి.. భారత్‌కు తప్పని చైనా గండం!

Apr 28 2026 5:02 PM | Updated on Apr 28 2026 5:16 PM

PV Sindhu loses-India womens team crashes out of Uber Cup 2026

ప్రతిష్ఠాత్మ‌క ఉబెర్ క‌ప్‌లో భారత్ ఆట ముగిసింది. భార‌త మ‌హిళ‌ల నంబ‌ర్‌వ‌న్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్ల‌లేక చ‌తికిల‌ప‌డింది. విష‌యంలోకి వెళితే ఉబెర్ క‌ప్‌లో భాగంగా గ్రూప్‌-ఏలో ఉన్న భార‌త్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో చైనాతో త‌ల‌ప‌డింది. అయితే చైనా చేతిలో 5-0తో ప‌రాజ‌యం చ‌విచూసిన భార‌త్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 

అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓట‌మి చ‌విచూసింది. దీంతో డ‌బుల్స్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ప్రియా కొన్‌జెంగ‌మ్‌-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓట‌మిపాలైంది. ఆ త‌ర్వాత మ‌రో డ‌బుల్స్‌లో ట్రిసా జాలీ-క‌విప్రియ సెల్వ‌మ్ జోడి కూడా ఓట‌మి పాల‌వ్వ‌డంతో భార‌త్ ఓట‌మి ఖ‌రారైంది. 

ఈ నేప‌థ్యంలో రివ‌ర్స్ సింగిల్స్‌లో ఇషారాణి బ‌రుహా తొలి గేమ్‌ను గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు గేముల్లో ఓట‌మిపాలైంది. ఇక థామ‌స్ క‌ప్‌లో భాగంగా ప‌రుషుల విభాగంలో భార‌త జ‌ట్టు బుధ‌వారం చైనాతో త‌ల‌ప‌డ‌నుంది.

చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement