క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి? | Kevin Pietersen Urges South Africa Board To Bring Back Heinrich Klaasen Out Of Retirement | Sakshi
Sakshi News home page

IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

Apr 30 2026 2:40 PM | Updated on Apr 30 2026 3:07 PM

Kevin Pietersen Urges South Africa Board To Bring Back Heinrich Klaasen Out Of Retirement

ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. క్లాసెన్ మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క్లాసెన్ మ‌రోసారి త‌న క్లాస్ చూపించాడు.

244 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.  ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 129 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే అభిషేక్‌, హెడ్‌, ఇషాన్ కిష‌న్ వికెట్ల‌ను ఆరెంజ్ వెంట‌వెంట‌నే కోల్పోయింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన క్లాసెన్‌.. ముంబై బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ‍

క్లాసెన్ కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడు దూకుడుగా ఆడడంతో లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలూండగానే సన్‌రైజర్స్‌ చేధించింది. ఈ నేపథ్యంలో క్లాసెన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని పీటర్సన్ కోరాడు.

దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ప్రపంచకప్‌ను కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా వేదికగానే జరగనుంది. ప్రోటీస్ జట్టుకు తొలి వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు ఇదొక మంచి అవకాశం. కాబట్టి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే క్లాసెన్‌ను తన రిటైర్మెంట్‌ను వెనుక్కి తీసుకోవాలని కోరాలి. 

ఒకవేళ అతడు తిరిగొస్తే సౌతాఫ్రికాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.  కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో పాటు టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ఐపీఎల్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేస్తుండడంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. క్లాసెన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆశ్చర్యపోన్కర్లేదు. గతంలో స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ కూడా తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాడు. ఇప్పుడు క్లాసెన్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో డికాక్‌ బాటలో నడిచే అవకాశముంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ‍క్లాసెన్ 59.14 సగటుతో 414 పరుగులు సాధించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement