‘ఎల్లో’ కార్డులపై సడలింపులు! | FIFA approves new World Cup discipline rules | Sakshi
Sakshi News home page

‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!

Apr 30 2026 5:59 AM | Updated on Apr 30 2026 5:59 AM

FIFA approves new World Cup discipline rules

‘ఫిఫా’ కొత్త నిర్ణయాలు  

వాషింగ్టన్‌: రాబోయే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్‌లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. 

సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్‌లో ఆడకుండా సస్పెన్షన్‌ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్‌ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్‌ మ్యాచ్‌లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్‌కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. 

ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్‌ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్‌ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

కీలక మ్యాచ్‌లకు టాప్‌ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్‌ కార్డు’ జారీ చేయవచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement