నువ్వు ఏడవద్దు!.. హగ్‌ ఇచ్చి మరీ.. వీడియో వైరల్‌ | Youtuber Gets Emotional After Meeting Cristiano Ronaldo, Viral Hug Moment Wins Hearts In Social Media, Video Trending | Sakshi
Sakshi News home page

నువ్వు ఏడవద్దు!.. హగ్‌ ఇచ్చి మరీ.. వీడియో వైరల్‌

Jun 13 2026 7:22 PM | Updated on Jun 13 2026 8:25 PM

Dont Cry: YouTuber Breaks Down Tears After Meeting Ronaldo Video Viral

PC: instagram

ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా పేరుగాంచాడు పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డోకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో కలిపి దాదాపు బిలియన్‌ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

దిగ్గజ ఫుట్‌బాలర్‌ రొనాల్డోను ఒక్కసారి నేరుగా కలిస్తే చాలు అని తపించిపోయేవారు కోకొల్లలు. సెలీనే డెప్‌ కూడా అలాంటి వారిలో ఒకరు. రొనాల్డోను కలవడమే కాదు.. అతడిని ఏకంగా హగ్‌ చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది. దీంతో.. ‘నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి.. మా కలను నువ్వు నెరవేర్చుకున్నావు’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఎవరీ సెలీనే?
సెలీనే బెల్జియం దేశానికి చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్‌. తొలుత ఆమె కూడా ఓ ఫుట్‌బాలర్‌. అయితే, ఆ తర్వాత ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. యూట్యూబ్‌లో ఆమెకు దాదాపు 60 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లోనూ 16 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు.

ఇక 26 ఏళ్ల సెలీనే గతంలోనూ ఫుట్‌బాలర్లు కెలియన్‌ ఎంబాపే, ఎర్లింగ్‌ హాలాండ్‌, నెయ్‌మార్‌ వంటితో వీడియోలు చేసింది. అయితే, తనకు అత్యంత ఇష్టమైన రొనాల్డోను మాత్రం ఇప్పుడే కలుసుకుంది.

కాగా రొనాల్డో ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రొనాల్డోను కలిసేందుకు వెళ్లిన సెలీనేకు మధురానుభూతి లభించింది. రొనాల్డోను చూడగానే సెలీనే తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీటి పర్యంతమైంది.

నువ్వు ఏడవద్దు
ఇంతలో అక్కడికి చేరుకున్న రొనాల్డో సెలీనేను హత్తుకుని.. ‘నువ్వు ఏడవద్దు’‌ అంటూ అనునయించాడు. అనంతరం  ‘స్పానిష్‌ వచ్చా.. లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడతావా?’ అని అడిగాడు. అందుకు ఆమె.. ఇంగ్లిష్‌ మాత్రమే అనడంతో.. ఎలా ఉన్నావు? అని పలకరించాడు. 

ఇందుకు బాగున్నానని సమాధానం ఇచ్చిన సెలీనే రొనాల్డో బాగోగుల గురించి అడిగింది. అనంతరం అతడికి ధన్యవాదాలు చెప్పి.. ఫొటో దిగి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement