ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. స్పెయిన్‌కు షాక్‌ | Cape Verde Draw With Spain In One Of The Biggest Shocks In FIFA World Cup History, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. స్పెయిన్‌కు షాక్‌

Jun 16 2026 12:31 AM | Updated on Jun 16 2026 1:40 PM

Cape Verde draw with Spain in one of the biggest shocks in FIFA World Cup history

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్‌ జట్టుకు వరల్డ్‌కప్‌లో తొలిసారి అడుగుపెట్టిన 'కేప్‌ వెర్డే' జట్టు గోల్‌రహిత డ్రాతో (0-0) నిలువరించి, ఊహించని షాకిచ్చింది. అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ (గ్రూప్‌-హెచ్‌) ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత గొప్ప అప్‌సెట్‌లలో ఒకటిగా నిలిచింది.

కేవలం ఆరు లక్షల జనాభా కలిగిన అట్లాంటిక్‌ ద్వీప దేశం కేప్‌ వెర్డే, ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజాల్లో ఒకటైన స్పెయిన్‌ను అడ్డుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌ మొత్తం స్పెయిన్‌ ఆధిపత్యం చెలాయించినప్పటికీ గోల్‌ మాత్రం సాధించలేకపోయింది.

స్పెయిన్‌ 24 షాట్లు కొట్టినా కేప్‌ వెర్డే రక్షణ గోడను దాటలేకపోయింది. ముఖ్యంగా 40 ఏళ్ల గోల్‌కీపర్‌ జోసిమర్‌ డయాస్‌ అద్భుత ప్రదర్శనతో స్పెయిన్‌ దాడులను తిప్పికొట్టాడు. ఫెర్రన్‌ టోర్రెస్‌, మిఖెల్‌ ఒయార్‌జబాల్‌, అమెరిక్‌ లాంపోర్టే ప్రయత్నాలను వరుసగా అడ్డుకుని హీరోగా నిలిచాడు.

మ్యాచ్‌ చివరి నిమిషాల్లో కేప్‌ వెర్డే ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసే దిశగా వెళ్లింది. పసికూన చేతిలో స్పెయిన్‌కు పరాభవం తప్పదని అంతా అనుకున్నారు. 90వ నిమిషంలో డినే బోర్జస్‌ హెడ్డర్‌ను స్పెయిన్‌ గోల్‌కీపర్‌ ఉనయ్‌ సైమన్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ర్యాన్‌ మెండెస్‌కు కూడా గెలుపు గోల్‌ చేసే అవకాశం లభించినా అది ఫలించలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement