ఏడీఏ సత్యనారాయణ
వట్‌పల్లి(అందోల్): ఎవరైనా ఎరువుల కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయికోడ్ ఏడీఏ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం వట్‌పల్లిలోని పలు ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు, ధరల పట్టికను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలు ఉండే లైసెన్సులను రద్దుచేసి దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.


