ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

కడ్తాల్‌: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌గుప్తా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని హనుమాన్‌ఘడ్‌ ఆంజనేయస్వామి ఆలయంలో సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ సత్యం, మాజీ సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, చెన్నకేశవ ఆలయ కమిటీ చైర్మన్‌ జంగారెడ్డి, సభ్యులు యాదయ్య, రమేశ్‌గౌడ్‌, నాయకులు రామకృష్ణగుప్తా, వీరేందర్‌గుప్తా, గోపాల్‌రెడ్డి, అంజి, సుధాకర్‌, తిరుమల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement