ఇబ్రహీంపట్నం: మండల పరిధి ముకునూర్ ఏఐటీయూసీ గ్రామ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్యామల నర్సింగ్‌రావు, గౌరవ అధ్యక్షుడిగా కుర్మిద్ద దశరథ, ఉపాధ్యక్షులుగా సునీల్‌కుమార్, చంద్రయ్య, కార్యదర్శులుగా రాంగోపాల్‌చారి, రవీందర్, సహాయ కార్యదర్శులుగా మహేందర్, అంజయ్య, ఆర్గనైజర్స్‌గా రాము లు, లక్ష్మయ్య, భిక్షపతిలను నియమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి సురేష్, కార్మికులు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూ
యాలాల: ఎస్సీ కార్పొరేషన్ పథకం రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారంఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శ్రీనిజ సోమవారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు దరఖాస్తుదారులతో మాట్లాడతారని చెప్పారు. అర్జీదారులు ఉదయం 11 గంటల వరకు రావాలని సూచించారు.
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
ఆమనగల్లు: వానాకాలం నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటామని మేడిగడ్డతండా సర్పంచ్ రాజేశ్వరి అన్నారు. సోమవారం తండాలో ఆమె పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఉప సర్పంచ్ విజయ్‌రాథోడ్, కార్యదర్శి ప్రశాంతి, స్థానికులు భాస్కర్, శాంతి, దోళి, రఘు, శ్రీను, మస్రు ఉన్నారు.
కంటి వైద్య శిబిరానికి స్పందన
ఆమనగల్లు: పట్టణంలోని రాంరెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రి విజన్ సెంటర్‌లో సోమవారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. శిబిరాన్ని లయన్స్‌క్లబ్ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. కంటి వైద్య సహాయకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ నిమిత్తం 35 మందిని ఎనుగొండలోని రాంరెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రికి తరలించారు. లయన్స్‌క్లబ్ జిల్లా చైర్మన్ యాదయ్య, పీఆర్‌ఓ పాషా, సభ్యులు మధుసూదన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్కారు బడులను బలోపేతం చేయాలి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంపీడీఓ జయరాం విజయ్ అన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల తరగతి గదులు, పరిసరాలు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను వెంటనే విద్యార్థులకు అందించాలని చెప్పారు. చిన్నారుల సంఖ్య పెంచేందుకు గ్రామస్తుల సహకారంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పాండు, ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.
మైసమ్మ సన్నిధిలో
ఎమ్మెల్యే పూజలు
కడ్తాల్: మండల పరిధి మైసిగండి మైసమ్మను సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, సర్పంచ్ ప్రేమజవహర్‌లాల్, మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్, ఉప సర్పంచ్ శేఖర్‌గౌడ్, ఆలయ ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, అర్చక సిబ్బంది ఉన్నారు.


