యాచారం: మన పంటను మనమే అమ్ముకుందాం. మద్దతు ధర పొంది ఆర్థిక ప్రగతి సాధిద్దామని ఎంపీడీఓ రాధారాణి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో సోమవారం మండల మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు.. సంఘాల ద్వారా రూ.కోట్లు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు పొంది తమ వ్యవసాయ పొలాల్లో పంటల సాగుకు పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. కానీ మన పొలాల్లో పండించే కూరగాయలను స్వయంగా మార్కెటింగ్ చేసి, విక్రయించుకుందామన్న ఆలోచన ఉండాలని సూచించారు. త్వరలో మండల కేంద్రంలో కూరగాయల ఉత్పత్తి విక్రయాలు జరిగేలా చేద్దామన్నారు. గతంలో మండల కేంద్రంలో కూరగాయల ఉత్పత్తి కేంద్రం ఉండేదని, కొన్ని కారణాల వలన మూత పడిందని పేర్కొన్నారు. మరలా తెరిపించే విధంగా కృషి చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.
ఎంపీడీఓ రాధారాణి


