ఉప సర్పంచ్‌ల కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచ్‌ల కమిటీ నియామకం

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

యాచారం: మండల పరిధి గునుగల్‌ పంచాయతీ ఉప సర్పంచ్‌ మచ్చ అనిల్‌కుమార్‌.. ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రంలో ఉప సర్పంచులు నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా అనిల్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా విస్లావత్‌ రాజు(తక్కళ్లపల్లితండా), ప్రధాన కార్యదర్శిగా మధుకర్‌రెడ్డి(నక్కర్తమేడిపల్లి), జాయింట్‌ కార్యదర్శులుగా నాగరాజు(ధర్మన్నగూడెం), అనమోని రవీందర్‌(కుర్మిద్ద), కోశాధికారిగా రెడ్డమోని శిరీష(మల్కీజ్‌గూడం), సభ్యులుగా కుమ్మరిగూడెం మంగ(యాచారం), గౌర లక్ష్మణ్‌(గడ్డమల్లయ్యగూడం), నాయిని శ్రీకాంత్‌(చింతుల్ల), అనిత(కొత్తపల్లి), మల్లమ్మ(మాల్‌), సువర్ణ(తక్కళ్లపల్లి)లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉప సర్పంచుల హక్కులు, వారి బాధ్యతల గురించి త్వరలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కలిసి విన్నవిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement