తుర్కయంజాల్: కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సత్యనారాయణ, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, కృష్ణ, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరో ఇద్దరికి గాయాలు
మీర్‌పేట: ఈదురు గాలులకు తాటిచెట్టు కూలి ఇంటిపై పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల మండలం షాన్‌పేటకు చెందిన సభావత్ లక్ష్మీసేవ్య ఇద్దరు కుమారులు, కోడలితో కలిసి కొంత కాలంగా జిల్లెలగూడ రాఘవేంద్రనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బలమైన ఈదురు గాలులు వీయడంతో వెనకాల ఉన్న తాటిచెట్టు విరిగి ఇంటిపై పడింది. దీంతో పైకప్పు రేకులు విరిగి నిద్రిస్తున్న లక్ష్మి(75), కుమారుడు వెంకట్రాం, కోడలు లలితపై పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు చెట్టుతో పాటు శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్ప త్రికి తరలించగా, తీవ్రగాయాలైన లక్ష్మి చనిపోయింది. కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. పని నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లి న చిన్నకొడుకు రమేశ్‌కు ప్రమాదం తప్పింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
శంకర్‌పల్లి: మండల పరిధిలోని ప్రొద్దటూరు–మోకిల వద్ద మూసీ వాగు వంతెనను శనివారం రాత్రి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనుల గురించి సీఐ, చేవెళ్ల ఏసీపీతో చర్చించారు. స్థానిక రెవెన్యూ, పంచాయతీ, ప్రజాప్రతినిధులతో నిత్యం మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఆయన వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐలు సురేశ్, చెన్నారెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతగిరిలో
అధికమాస యజ్ఞాలు
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అధికమాసం సందర్భంగా 30 రోజుల పాటు యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కృష్ణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధికమాసంలో యజ్ఞాలు నిర్వహించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి, బీఆర్‌ఎస్ యువ నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, దోమ మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


