మహేశ్వరం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారంలో కుండె వెంకటేశ్ ఫామ్ హౌస్‌లో బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో శనివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో దిగుబడి అధికంగా రావడంతో పాటు పండించిన ధాన్యం, కూరగాయాలు, పండ్లు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. బీజేపీ, కిసాన్‌మోర్చా నాయకులు రైతుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మొక్కలు నాటి, గోమాతకు పశుగ్రాసం వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బస్వ పాపయ్య గౌడ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎస్ రత్నం, పొరెడ్డి నర్సింహారెడ్డి, కంజర్ల ప్రకాష్, ముత్యాల భాస్కర్, కడారి జంగయ్య యాదవ్, మిద్దె సుదర్శన్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు టి.యాదీష్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


