షాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975– 1976లో టెన్త్ పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి, స్కూల్‌లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు. 1992– 93 బ్యాచ్‌కు చెందిన కొండ విజయ్‌కుమార్, ప్రవీణ్, మల్లికార్జున్ ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్, జిల్లా హాకీ చైర్మన్ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పామెన భీంభరత్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


