బోధన రుసం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

బోధన రుసం చెల్లించాలి

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

బోధన రుసం చెల్లించాలి

ఇబ్రహీంపట్నం: విద్యార్థుల పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయి చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలు, కలెక్టరేట్లను ముట్టడించినా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్‌ కార్డుల ద్వారా విన్నవించినా ప్రభుత్వానికి చలనం కలగడంలేదని మండిపడ్డారు. మరలా విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్తకొత్త నిబంధనలు పెడుతోందని పేర్కొన్నారు. వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే బోధన రుసం, ఉపకార వేతనం చెల్లించాలని, లేని పంక్షలో మరో పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement