ఐఐటీలో మెరిసిన హర్షిత | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో మెరిసిన హర్షిత

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ఐఐటీలో మెరిసిన హర్షిత

కడ్తాల్‌: మండల పరిధి వాస్‌దేవ్‌పూర్‌ గ్రామానికి చెందిన పాత్లవత్‌ సునీత– నరేందర్‌నాయక్‌ దంపతుల కూతురు హర్షిత జేఈఈ అడ్వాన్స్‌లో ఆల్‌ఇండియా ఎస్టీ కేటగిరి విభాగంలో 467 ర్యాంకుసాఽధించారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కి ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ సీటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌లో నరేందర్‌నాయక్‌ సోదరుడు పాత్లవత్‌ లక్ష్మణ్‌నాయక్‌– మంజుల దంపతుల కూతురు ప్రీతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జార్ఖండ్‌ ధన్‌బాద్‌ఐఐటీలో సీటు సాధించింది. మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. పట్టుదలతో చదివి అక్క చెల్లైలెన హర్షిత, ప్రీతిలు ఐఐటీలో చోటు దక్కించుకోవడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హర్షిత, ప్రీతిలను కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement