కడ్తాల్: ఉప సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా గానుగుమార్లతండా ఉప సర్పంచ్ జర్పుల లక్పతినాయక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యకవర్గాన్ని నియమించారు. అధ్యక్షుడిగా జర్పుల లక్పతినాయక్(గానుగుమార్లతండా), ఉపాధ్యక్షుడిగా కిరణ్‌గౌడ్( చల్లంపల్లి), ప్రధాన కార్యదర్శిగా రమేశ్(బాలాజీనగర్),సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్(మక్తమాధారం), కోశాధికారిగా రతన్(గోవిందాయిపల్లితండా) ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మహేశ్వర్‌కుమార్(సాలార్‌పూర్), యాదయ్య(రావిచేడ్)తో పాటు.. సభ్యులుగా హీరానాయక్, ఈరెడ్డి యాదగిరిరెడ్డి, దేవేందర్, రామకృష్ణ, గోపాల్, బల్వంత్‌రెడ్డి, మహేశ్, సత్తయ్య, యశోధ, పంతు, నర్సింహ, లక్ష్మణ్‌నాయక్, తులసీరాం ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీని సన్మానించారు.


