అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ

ఇబ్రహీంపట్నం రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల జీహెచ్‌ఎంసీ పరిధి ఆదిబట్లలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గజ్జెల శ్రీలతకు అంగన్‌వాడీ కేంద్రంలో అక్కడి నిర్వాహకులు గుడ్లు అందజేశారు. ఆ గుడ్లను శనివారం ఉడకబెట్టి తన ఏడాదిన్నర వయసు గల చిన్నారికి తినిపించే క్రమంలో దుర్వాసన వచ్చింది. గమనించి చూడగా.. గుడ్డు కుళ్లిపోయినట్లు గుర్తించింది. అన్నింటిని పరిశీలించగా.. పాడైపోయాయి. దీంతో విషయాన్ని ఆమె.. భర్తకు వివరించింది. ఆయన సామాజిక మాధ్యమాల్లో కుళ్లిన గుడ్ల గురించి పోస్టు చేయగా.. వైరల్‌ మారింది. బాలింతలు, చిన్నారులకు పోషక పదార్థాలు అందించే విషయంలో అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement