ప్రాచీన కళలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాచీన కళలను ప్రోత్సహించాలి

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ప్రాచీన కళలను ప్రోత్సహించాలి యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఎస్‌ఐకి సత్కారం నిధులు ముంజూరు చేయాలని వినతి కూరగాయల ధరలు హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌లోని రైతు బజార్‌లో కూరగాయల ధరలు (కిలో.. రూపాయల్లో).. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 40, కాకర 35, బీర 40, కాలిఫ్లవర్‌ 18, క్యాబేజీ 21, క్యారెట్‌ 40, దొండ 37, ఆలు 16, ఉల్లిగడ్డ 22, గోకర 28, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 23, చిక్కుడు 65, చామ 28, బీట్‌రూట్‌ 25, కీర 35, ఫ్రెంచ్‌బీన్స్‌ 105, క్యాప్సికం 73.

మంచాల: మన చరిత్ర– మన సంస్కృతిని తెలిపే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని సర్పంచ్‌ మానస వినయ్‌ అన్నారు. గ్రామంలో మూడు రోజులుగా నల్ల చక్రవర్తి జీవిత చరిత్ర వీధి నాటకం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వారికి ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు. నేడు యువత దురలవాట్లకు చేరువై జీవితాలను అంధకారం చేసుకుంటుందని తెలిపారు. అలాంటి వారికి ప్రాచీన కళలు, సంప్రదాయాలు, మానవ విలువలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

మంచాల: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య అన్నారు. శనివారం మండలంలోని నోముల గ్రామంలో ఢీవైఎఫ్‌ఐ నూతన కమిటీని నియమించారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎర్ర ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ఈరమల్ల శివకుమార్‌, ఉపాధ్యక్షుడిగా ఎర్ర ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. యువత ఎదుర్కొంటున్న విద్య, నిరుద్యోగ సమస్యలపై ఢీవైఎఫ్‌ఐ పోరాడుతుందన్నారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు పి.జగన్‌, నాయకులు నాగరాజ్‌, సృజన్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు: ఎస్‌ఐ కోటేశ్వర్‌రావ్‌ను శనివారం బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు మీసాల వర్షిత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాకప్పి, సన్మానించారు.

లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు

తుక్కుగూడ: కా ర్పొరేషన్‌ పరిధి లోని జెన్నాయిగూ డ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామివానికి పలు రకాల అభిషేకాలు, అలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కోటగళ్ల రంజిత్‌కుమార్‌, ఏఓ శ్రీనివాస్‌, ఆలయ పండితులు మురళీశర్మ, అజయ్‌శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం: నందుపల్లి గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని శనివారం నాగారంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గ్రామ బీజేపీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీలు, సీసీరోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. త్వరలో నిధులు విడుదల చేయిస్తామని ఎంపీ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుండె వెంకటేశ్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు రఘురెడ్డి, దళిత మోర్చా మండల ఉపాధ్యాక్షులు రంగుల రవి, నాయకులు ఆకన్‌పల్లి ఆశోక్‌, ఆకన్‌పల్లి రాజశేఖర్‌, నవీన్‌ పలువురు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement