స్కూల్‌.. ఫుల్‌! | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌.. ఫుల్‌!

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

బోధన కష్టమవుతుందనే..

నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు విశేష ఆదరణ

నో అడ్మిషన్‌ బోర్డు పెట్టేసిన సిబ్బంది

మంచాల: విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న ప్రస్తుత తరుణంలో.. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులో చేరడంతో నో అడ్మిషన్‌ బోర్డు పెట్టారు. ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ ప్రవేశాలు రావడంతో ఉపాధ్యాయులు సైతం చేతులెత్తేశారు.

● మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో 1,605 మంది చదువుతున్నారు.

● ప్రీ ప్రైమరీ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నలుగురు ఉపాధ్యాయులు, నలుగురు ఆయాలను నియమించారు.

● ఒకటి నుంచి 5వ తరగతి వరకు 495 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క తరగతిలో 3 సెక్షన్లు, ఒక్క సెక్షన్‌కు 33 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి చదువు చెప్పడానికి 18 మంది ఉపాధ్యాయులను నియమించారు.

● ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 960 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. ఒక్క తరగతిలో 4 సెక్షన్లు, ఒక్కో సెక్షన్‌లో 40 మంది చొప్పున 160 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధించేందుకు 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

● ప్రస్తుతం మంచాల మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 37 గ్రామాల నుంచి ఇక్కడికి చదువు కోసం వస్తున్నారు. వీరి రాకపోకల కోసం ఐదు బస్సులు నడిపిస్తున్నారు.

● ఎక్కువ మందిని చేర్చుకోవడం పాఠశాల నిబంధనలకు విరుద్ధమే కాకుండా, నిర్వహణ కష్టంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్ద నోఅడ్మిషన్‌ బోర్డు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థులను చేర్చుకున్నాం. ప్రస్తుతం 1,605 మందికి పైగా ఉన్నారు. మరింత మందిని తీసుకుంటే బోధన కష్టమవుతుంది. అందుకే నో అడ్మిషన్‌ బోర్డు పెట్టాం.

– జి. గిరిధర్‌ గౌడ్‌ (హెడ్‌ ఆఫ్‌దీ స్కూల్‌)

నాణ్యమైన, సృజనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటాం.

– జహీర్‌, ఉపాధ్యాయుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement