ఇద్దరు మహిళలపై కేసు
షాద్‌నగర్ రూరల్: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు మహిళలపై కేసు నమోదయింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లాల్‌సింగ్ తండాలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఏఓ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. లాల్‌సింగ్ తండాకు చెందిన కవిత ఇంట్లో కొందుర్గు మండలం పాత ఆగిర్యాలకు చెందిన రాజేశ్వరి నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు నిల్వ చేసింది. ఈ విత్తనాలు అదే తండాలో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు 22 కిలోల నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకుని వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. ఇన్‌చార్జి ఏఓ రాజేందర్‌రెడ్డి ఫ/ర్యాదు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రణయ్ తెలిపారు.
యువకుడికి రిమాండ్
కడ్తాల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కడ్తాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మూడ చరణ్ ఓ యువతిని కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తి చేస్తున్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారన్నారు.
షాబాద్: డ్యాన్స్ నేర్పించేందుకు వెళ్లిన మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన డాకూరి భాస్కర్ కుమారుడు మధు(19) షాద్‌నగర్ రాక్ డ్యాన్స్ స్కూల్‌లో డ్యాన్స్ మాస్టర్. రోజు మాదిరిగానే ఈ నెల 10న ఇంట్లో డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తున్నాని చెప్పాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు షాబాద్ మండలం మన్‌మర్రి గ్రామంలో స్నేహితుడు జశ్వంత్ వాళ్ల అక్క కొడుకు తొట్టెల ఫంక్షన్‌లో ఉన్నానని వీడియో కాల్ చేశాడు. ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు మధుకు ఫోన్ చేశారు. దీంతో మిత్రులు ఫోన్ లేపి ఈతకు వచ్చామని మధుకు ఈత రాక చనిపోయాడని చెప్పారు. తమ కుమారుడికి ఈత వచ్చని జశ్వంత్, అతని స్నేహితులపై తమకు అనుమానం ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


