అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని బాటసింగారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ధన ఆంజనేయులు 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం దాసరి ప్రతాప్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ధన ఆంజనేయులు ఈ నెల 7న సరూర్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి లాంగ్‌జంప్ ఈవెంట్‌లో సత్తాచాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా బాటసింగారం పాలకవర్గం. పాఠశాల ఉపాధ్యాయ హర్షం వ్యక్తం చేస్తూ ఆంజనేయులను అభినందించారు.
మైలార్‌దేవ్‌పల్లి: కారు చక్రాల కింద పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పల్లెచెరువులో గోబింద్‌రామ్ కుటుంబం నివాసముంటోంది. అతని కుమారుడు షియంకుమార్(3) బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీకి చెందిన డ్రైవర్ అరవింద్(30) కారులో వేగంగా వచ్చాడు. బాలుడిపై కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని మాట్లాడి సర్దిచెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


