మత్తుపదార్థాలతో జీవితం చిత్తు | - | Sakshi
Sakshi News home page

మత్తుపదార్థాలతో జీవితం చిత్తు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

మత్తుపదార్థాలతో జీవితం చిత్తు

శంకర్‌పల్లి: మాదకద్రవ్యాల వినియోగంతో యువ త బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మోకిల ఎస్‌ఐ సురేశ్‌గౌడ్‌ అన్నారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఈగల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల దుకాణాల్లో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఇటీవల మత్తు పదార్థాలను యువత పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుందని, దీంతో తమ ఆరోగ్యంతో పాటు జీవితం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు కొనే, అమ్మేవారిపై పటిష్ట నిఘా ఉంటుందని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement