పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని వినతి

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

తుర్కయంజాల్‌: పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం రాగన్నగూడలోని ఆదిబట్ల సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌ మాట్లాడుతూ.. 71 మంది కార్మికులు, గతంలో మున్సిపాలిటీలుగా ఉన్న సమయం నుంచి పనిచేస్తున్నారని, జీహెచ్‌ఎంసీలో విలీనం అయినప్పటి నుంచి వేతనాలు రావడం లేదని వాపోయారు. అనంతరం సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ బి.సత్యనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సాలయ్య, కృష్ణ, రవి, స్వప్న, జయ, దీవెన, జ్యోతి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement