మంచాల: నగరంలోని కొత్తపేట్‌లో ఈనెల 16న జరిగే యువ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య కోరారు. గురువారం మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక బాధ్యతగా దేశ భక్తితో నడుచుకోవాలన్నారు. యువ సమ్మేళనం నిర్వహణ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బుగ్గరాములు, గోపాల్, బుచ్చయ్య, యూసుఫ్ అలీ, మల్లేష్, అంజయ్య, వీరేష్, గణేష్, విజయ్, రాజు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.


