అబ్దుల్లాపూర్‌మెట్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని చెప్పారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ మండల పరిధిలో 400 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పెద్దఅంబర్‌పేటలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కయంజాల్ జోన్‌కు 153 మంది, పెద్దఅంబర్‌పేట్‌లో 140, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన 107 మందికి చెక్కులు మంజూరు కాగా రూ.4.46 కోట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
180 మందికి చెక్కుల అందజేత
కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో 180 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని అన్నారు. పేదల పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. ఖానాపూర్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గీత, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, బీచ్యానాయక్, ప్రభాకర్‌రెడ్డి, భిక్షపతి, కేశవరెడ్డి, వెంకటేశ్, తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


