యాచారం: గృహ నిర్మాణ రంగంలో జీవితాలను వెల్లదీస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తాపీమేసీ్త్రల సంఘం నేతలు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాపీమేసీ్త్రలు గురువారం యాచారంలో సమావేశమయ్యారు. సిమెంట్, ఇటుక, రాయి, ఇతర ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా నిర్మాణ రంగంలో కూడా యజమానులు ధరలు పెంచాలన్నారు. తాపీమేసీ్త్రలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు, రేషన్‌కార్డులు, ఎలాంటి షరతుల్లేకుండా బ్యాంకుల్లో రుణాలు అందజేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని, జిల్లా స్థాయి అధికారులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సంఘం నేతల నిరసన
కడ్తాల్: హక్కుల సాధన కోసం మండల కేంద్రంలో బాలాజీ తాపీమేసీ్త్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాపీమేసీ్త్రలు మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణదారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్‌లు పెరిగిన సెంట్రింగ్ కూలీల ధరలకు నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా ఇళ్లను నిర్మించే వారు తమ ధరలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రయ్య, శ్రీరాములు, వెంకటేశ్, జంగయ్య, శ్రీను, బాబు, మల్లేశ్, కోటయ్య, మల్లేశ్, కృష్ణ తదితరులు ఉన్నారు.
భవన నిర్మాణ పనులు బంద్
ఇబ్రహీంపట్నం: తాపీమేసీ్త్రలకు నిర్దిష్టమైన రేట్లను నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ పనులను బంద్ పెడుతున్నట్లు ఇబ్రహీంపట్నంలోని వరసిద్ధి వినాయక భవన నిర్మాణ కార్మిక సంఘం గురువారం పిలుపునిచ్చింది. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాపీమేసీ్త్రల రేట్లను పెంచాలని ఈనెల 16వ తేదీ వరకు పనులను బంద్ పెడుతున్నట్లు తెలిపారు. సంఘం నిబంధనలు అతిక్రమించి ఎవరైన పనిచేస్తే రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసంఘం అధ్యక్షుడు బాలరాజు, సభ్యులు రఘు, దశరథ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


